POLICE COMMEMORATION DAY

1
13

Tributes to the martyrs who sacrifice their lives for the wellbeing of the nation. Warm wishes to all the officers who put their duty first and their comfort last.

#PoliceCommemorationDay

#SaluteToPoliceMartyrs

1 COMMENT

  1. ‘పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి’

    అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,*

    *పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు పరామర్శ*
    ఈరోజు రామగుండం కమిషనరేట్ రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ), మంచిర్యాల కలెక్టర్ దీపక్ , పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్. పోలిస్ గౌరవందనం తీసుకుని, వివిధ సంఘటనలో ఉగ్రవాదులచే, అసాంఘిక శక్తులచే పోరాడి అసువులు బాసిన అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అమరులైన పోలీస్ అధికారులు 214 మంది పేర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు గారు నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛము ఉంచి సీపీ , మంచిర్యాల కలెక్టర్ గారు, పెద్దపల్లి డీసీపీ, పోలీస్, ఇతర అధికారులు మరియు సిబ్బంది నివాళులు అర్పించారు.

    ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… పోలీసు అమరవీరుల దినోత్సవం నిర్వహించుకోవడం వెనుక సైనికుల వీరోచిత పోరాటం మహోన్నత చరిత్ర దాగుంది. 1959 అక్టోబరు 21న భారత్- చైనా సరిహద్దున సియాచిన్ ప్రాంతంలోని భూ భాగాన్ని ఆక్రమించేందుకు చైనా రక్షణ బలగాలు యత్నించాయి. ఆ సమయంలో డీఎస్పీ కరమ్ సింగ్ ఆధ్వర్యంలో విపరీతమైన చలిలో 10 మంది సీ ఆర్ పి ఎప్ జవాన్లు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. అక్సాయ్ చిన్ ప్రాంతం లోని హాట్ స్ప్రింగ్ వద్ద జరిగిన పోరాటంలో పది మంది సీ ఆర్ పి ఎప్ జవాన్లు అమరులయ్యారు. భారత దేశ రక్షణ కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి, దేశం కోసం ప్రాణాలు వదిలిన తొలి సందర్భమది. ఇందుకు గాను అన్ని రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశ మయ్యారు. అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని తీర్మానించారు. వీరుల రక్తం పారిన ఆ ప్రదేశాన్ని పవిత్ర స్థలంగా భావించి ఏటా అన్ని రాష్ట్రాల పోలీసులు సందర్శించి నివాళులర్పిస్తున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్టోబరు 21ని పోలీసు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటు అమర పోలీసుల వీరల త్యాగాన్ని స్మరించుకొని వారి కుటుంబాలకు సానుభూతిని, సహకారాన్ని ప్రకటించి వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నారు.
    పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం అని వ్యవస్థ సాఫీగా నడవడంలో పోలీసులది కీలకపాత్ర. మావోయిస్టులతో, అసాంఘిక శక్తులతో జరిగే పోరులో అమరులైన పోలీసుల త్యాగాలు అజరామరం. శాంతిభద్రతల పరిరక్షణలో సంఘవిద్రోహక శక్తులకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలను పణంగా పెట్టారు. పోలీస్ అమరవీరుల త్యాగలు మరువలేనివని,ప్రజల, దేశ రక్షణలో ప్రాణం కoటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకునేందుకే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తాం. పది రోజుల పాటు పోలీసుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతాం అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here