మంచిర్యాలలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐ పీఎస్

0
25

మంచిర్యాల జిల్లా లోని రౌడీషీటర్స్ కి కౌన్సిలింగ్…

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..

రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా నిఘా…. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం పిడి యాక్ట్ అమలు చేస్తాం: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,*

ఏలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తన తో ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తాం

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంచిర్యాల జిల్లాలోని రౌడీషీటర్ల ప్రవర్తన లో మార్పు కోసం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) కౌన్సిలింగ్ నిర్వహించారు. సీపీ రౌడీషీటర్ల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు , ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ….ఈరోజు నుండి రౌడీ షీటర్స్ ఉన్న వారి పేర్లు గాని, మొహాలు గాని ఎలాంటి కేసులోనైనా, గ్రూపు తగాదాలలో ఐనా ఎవరి ప్రోద్బలంతో, ప్రభలంతోనైనా, ఎవరైనా ఫోన్లు లలో చెప్పడం వలన గాని నేరాలలో పాలుపంచుకోకూడదు ఈరోజు కౌన్సిలింగ్ హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలలో పాలుపంచుకుంటే చట్టం లో ఉన్న ఆక్ట్ ల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడప వలసి వస్తుందని సిపి హెచ్చరించారు. కౌన్సెలింగ్ నిర్వహించడానికి ప్రధాన కారణం మీ నేర ప్రవృత్తిని విడిచి కుటుంబ సభ్యులతో కలిసి మంచి జీవన ఉపాధి ఏర్పరచుకొని సత్ప్రవర్తనడం మెలగాలని అన్నారు. కొంతమంది చెప్పిన మాటలు విని,నమ్మి చట్ట వ్యతిరేకమైన కార్యకాలపాలు పాల్పడితే బిర్యాని ప్యాకెట్లు, మందు, కొంత డబ్బు లభిస్తుందేమో కానీ అది శాశ్వతమైనది కాదు. రౌడీ షీటర్ల పై ప్రత్యేకంగా ఉంటుందని ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పిలిపించవచ్చు, రాత్రి, పగలు సమయంలో మీ ఇండ్లను సందర్శించి మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుందన్నారు. మీపై ఒక ప్రత్యేక టీం చేత నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ కదలికలని, మీ ఫోన్ నెంబర్లని సాంకేతిక ఆధారంగా ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారనేది, ఎం చేస్తునరనే పూర్తిస్థాయిలో పోలీస్ సర్వ లెన్స్ లో మిమ్మల్ని గమనిస్తూ ఉంటాం అన్నారు.

మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టిన మీకేం కాకుండా మేము చూసుకుంటామని ధైర్యం చెప్పిన ఎలాంటి నేరాలు పాల్పడకూడదు. గతంలో నేరాలకు పాల్పడిన వారు.. నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని, నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం మరియు శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కావున “నేరస్థులు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యం” అని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.

ఏ నేరం చేసినా పోలీసులు గుర్తిస్తారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నేరం చేసే ముందు, మీరు రౌడీ షీటర్ అని మీ ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య కలిగించిన, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here