కల్వచర్ల గ్రామంలో కాటన్ సెర్చ్…

0
4

https://we.tl/t-gRKdOyp9Ek?utm_campaign=TRN_TDL_05&utm_source=sendgrid&utm_medium=email&trk=TRN_TDL_05

Bbma న్యూస్ రామగిరి :అక్టోబర్ 23
రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. రాజు రామగిరి ఎస్సై చంద్ర కుమార్ ,మంథని ఎస్ఐ డి. రమేష్ ,ముత్తారం ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో కార్టెన్ సెర్చ్ నిర్వహించారు.గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి గ్రామంలోని స్థితిగతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. సరైన పత్రాలు లేనటువంటి ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపైన చాలాన్లు వేయడం జరిగింది. గ్రామంలోని యువత గంజాయి, మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించి చెప్పడం జరిగింది .గంజాయి, మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన, విక్రయించిన వారి వివరాలను పోలీసులకు చేరవేయాలని చెప్పడం జరిగింది. మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పడం జరిగింది. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించడం జరిగింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి కేసుల్లో ఇరుక్కొని తమ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. మీకు తెలియని ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మిమ్మల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేసిన వెంటనే మీరు 1930 నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని సూచించడం జరిగింది.సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని చెప్పడం జరిగింది. గ్రామంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని చెప్పడం జరిగింది. మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించడం జరిగింది. మీకు ఎటువంటి సమాచారం తెలిసిన తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని సూచించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here