రామగుండం కమిషనరేట్ లోని మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో మేఘ రక్తదాన శిబిరం..ప్రల్గొన్న సిపి…

0
2

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా “మెగా రక్త దాన శిబిరం” ప్రారంభించిన సిపి…

రక్తదానం మహాదనం, రక్తదానంపై అపోహలు వద్దు:

ఈరోజు మొత్తం 100 యూనిట్ల రక్త సేకరణ..
పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగలను స్మరిస్తూ రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో లో మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్ వారు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారం తో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపీఎస్,(ఐజీ) రిబ్బన్ కట్ చేసి క్యాంప్ ని ప్రారంభించారు.
అనంతరం సిపి మాట్లాడుతూ…అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. అమరుల త్యాగ ఫలంగానే ఈరోజు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారన్నారు. రక్త దానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని, క్లిష్ట పరిస్థితులల్లో ,ఉన్నప్పుడూ ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి వారిపాలిట దేవుళ్ళుగా మారతారు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here