#BBMA POLICE E-NEWS…..

0
42

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి.*

*- – – గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి*

*- – – వార్షిక తనిఖీల్లో భాగంగా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు*

ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు సూచించారు. ఈరోజు వార్షిక తనిఖీ లో భాగంగా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని,బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చుని అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయని అసాంఘిక కార్యకలాపాలు ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ కార్ మరియు బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు దూరంగా ఉన్నప్పటికీ 10 నిమిషాల్లో చేరుకునే విధంగా పని చేస్తున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసుల గురించి, మరియు పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ల పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ0లో 5s అమలు చేసిన తీరును, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారి యొక్క డ్యూటీ ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రిసెప్షన్ వర్టికల్ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు ను పిటిషన్ మేనేజ్మెంట్లో ఎంట్రీ చేసిన డాటా ను తనిఖీ చేశారు. రిసెప్షన్ఈస్ట్ గా ప్రతి దరఖాస్తు పై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్ లో జనరేట్ చేసినా రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్నివిభాగాలు తిరిగి క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ గారు మొక్కలు నాటడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here