తేదీ 12.11.2024 నాడు ఉదయం అందాద 4.30 గంటలకు రంగంపల్లి RR. ఫంక్షన్ హాల్ నందు కూలి పని ముగించుకుని నడుచుకుంటూ ఉదయ నగర్ లోని తమ ఇంటికి వెళుతున్న కుక్క అమృత, కుక్క భాగ్య, కుక్క పద్మ, కుక్క కాంతమ్మ అను నలుగురు మహిళలను పెద్దపల్లి ఆదర్శనగర్ సమీపంలో వెనుక నుండి గుర్తుతెలియని కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి ఢీకొట్టి పారిపోగా కుక్క అమృత, కుక్క భాగ్య లకు తీవ్ర రక్త గాయాలు అయి అక్కడికక్కడే మరణించినారు కుక్క పద్మ, కుక్క కాంతమ్మ లకు గాయాలు కాగా అమృత భర్త ఫిర్యాదు మేరకు పెద్దపెల్లి SI.లక్ష్మణరావు గారు కేసు నమోదు చేసి, పెద్దపెల్లి ఏసిపి G. కృష్ణ గారి ఆదేశానుసారం క్రైమ్ వెహికల్ గురించి మూడు బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేయనైనది. ఆ తదుపరి విచారణలో భాగంగా కేసును పెద్దపెల్లి సిఐ ప్రవీణ్ కుమార్ గారు దర్యాప్తు చేపట్టి నమ్మదగిన సమాచారం మేరకు నిందితులు ఆక్సిడెంట్ చేసిన షిఫ్ట్ డిజైర్ కారును అప్పన్నపేట గ్రామం లో దాచి సాక్షాధారాలను మార్చే ఉద్దేశంతో కారును బాగు చేసుకోవడానికి అక్కడినుండి తీసుకు వెళుతున్నారని తెలిసి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అప్పన పేట శివారులో నిందితులైన పోతారం గ్రామానికి చెందిన డ్రైవర్ A1. చల్ల పవన్ కళ్యాణ్ S/o రాజేందర్ , 21 సంవత్సరాలు, ఒడ్డేర, కారు ఓనర్ A2. చల్ల శ్రీనివాస్, S/o సమ్మయ్య, 26 సంవత్సరాలు, ఒడ్డేర లను, swift Dzire కారు యుక్తంగా పట్టుకున్నారు. కేసును ఛేదించిన CI. ప్రవీణ్ కుమార్, SI. లక్ష్మణ్ రావు, సిబ్బందిని పెద్దపల్లి ACP, జి. కృష్ణ గారు అభినందించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here