పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని బండారు కుంటకి చెందిన గౌస్ బాబా అనే తొమ్మిది సంవత్సరాల బాలుడి పై అదే కాలని కి చెందిన చాంద్ పాషా అనే 36 సంవత్సరాల వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు అని ఆటో లో ఆడుకుంటున్న తన పై అకారణంగా అక్కడే వున్న చికెన్ సెంటర్ లోని కత్తి తీసుకు వచ్చి మెడ ప్రాంతం లో గాయ పరచాడని దాడికి గురైన బాలుడు చెప్పాడు .బాలుడు చాకచక్యంగా తప్పించుకోవడంతో స్థానికులు గమనించి హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బాలుడి తండ్రి అబ్దుల్ హనీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు