#COLLECTOR MANCHERIAL

0
26

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రతిభ జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య పాఠశాలలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.జిల్లాలో మొదటిరోజు గ్రూప్ -3 పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగిందని జిల్లాలో పరీక్ష నిర్వహణ కొరకు 48 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 15 వేల 38 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 8 వేల 246 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష నోడల్ అధికారి, పోలీస్ నోడల్ అధికారి, రీజియన్ కో-ఆర్డినేటర్ లతో పాటు ప్రతీ పరీక్ష కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు, శాఖ అధికారులు, ఐడెంటిటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్, రూట్, జాయింట్ రూట్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ల ను నియమించడం జరిగిందని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంచడం జరిగిందని, త్రాగునీరు, మూత్రశాలలు నిరంతర విద్యుత్ సరఫరా ఇతర అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు.మొబైల్ ఫోన్లు,పేజర్లు,ఎలక్ట్రానిక్ వస్తువులు,కాలిక్యులేటర్,ఎనలాగ్/డిజిటల్ గడియారాలు,బ్లూటూత్ లను లోపలికి అనుమతించబడవని తెలిపారు.హాల్ టికెట్,వెరిఫికేషన్ కొరకు మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here