#పెద్దపల్లి కలెక్టర్

0
36

సుల్తానాబాద్, నవంబర్ -18

——————————————-

సుల్తానాబాద్ మండలం వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

——————————————-

👉పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయవద్దు.

👉తేమ శాతం ప్రకారం పత్తి పంటకు మద్దతు ధర చెల్లింపు.

——————————————-

జిన్నింగ్ మిల్లులకు వచ్చే పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా నాణ్యమైన పత్తిని మద్దతు ధర పై కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు.

 

సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలం వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిన్నింగ్ మిల్లులో పత్తి రైతులు తమ యొక్క పత్తిని సిసిఐ కు అమ్ముకునే విధానంలో కంప్యూటర్ సాఫ్ట్వేర్, జిన్నింగ్ ప్రాసెస్, జిన్నింగ్ మిల్లులో గల పత్తి స్టాక్స్ విచారించి తెలుసుకున్నారు.

పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, జిన్నింగ్ మిల్లులో మంచినీరు, టాయిలెట్లు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

 

పత్తి పంట 8 శాతం తేమ ఉంటే క్వింటాళ్ల 7521 రూపాయల మద్దతు ధర వస్తుందని, 8 నుంచి 12 శాతం వరకు పెరిగే ఒక్కో శాతానికి 75 రూపాయల చొప్పున క్వింటాళ్లుకు మద్దతు ధర తగ్గించడం జరుగుతుందని, 12 కంటే ఎక్కువ తేమ శాతం ఉంటే కొనుగోలు చేయబోమని కలెక్టర్ తెలిపారు.

 

పత్తి రైతులందరూ తమ యొక్క పత్తి తేమ శాతం 8 నుంచి 12 లోపు ఉండే విధంగా చూసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని, మంచి పత్తి చెడు పత్తి కలవకుండా వేర్వేరుగా తీసుకొని రావాలని కలెక్టర్ కోరారు.

 

ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి, సిసిఐ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here