పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తా రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్

0
16

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : సిపి

బిబిఎంఎ/గోదావరిఖని: నవంబర్ 19

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కె. లక్ష్మి నారాయణ అనారోగ్యంతో మరణించారు. మంగళవారం సిపి కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ భార్య శంకరమ్మ కి భద్రత ఎక్స్గ్రేషియా 8లక్షల రూపాయల చెక్ ను పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, సూపరిండెంట్ సంధ్య, జూనియర్ అసిస్టెంట్ నజియా ఇరమ్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here