#TELANGANA POLITICAL NEWS

0
9

వరంగల్ నగరంలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అంకితం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధుల తోడుగా కళాక్షేత్రానికి ప్రారంభోత్సవం చేశారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా కవి కాళోజీ నారాయణ రావు గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.

 

కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కాళోజీ గారి ఫోటో గ్యాలరీని, అలాగే తొలి ప్రదర్శనగా వారి జీవితంలోని కొన్ని ఘట్టాలను గుర్తుచేస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని వీక్షించారు. అక్కడే డిజిటల్ పద్ధతిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here