మిల్లెట్ యూనిట్ పరిశ్రమ ను పరిశీలించిన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి 

0
38

మిల్లెట్ యూనిట్ పరిశ్రమ ను పరిశీలించిన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి,

బిబిఎంఎ న్యూస్ /భూపాల పల్లి,

ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమంలో భాగంగా మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. దీనిని నేను చాలా ఆశీర్వాదంగా భావిస్తున్నాను. మిల్లెట్ ప్రాసెస్సింగ్ యూనిట్ చాలా బావుంది. మిల్లెట్స్ తో చేసిన స్వీట్స్ అద్భుతంగా ఉందని కేంద్ర వినియోగదారులు, ఆహారం, ప్రజా పంపిణీ. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిమూబెన్ జయంతి బాయ్ బంబానియా తెలిపారు. బుధవారం గణపురం మండలం, చెల్పూర్ గ్రామంలో మిల్లెట్ యూనిట్ పరిశ్రమ ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలు మిల్లెట్స్ తో తయారు చేసిన మల్టీ గ్రేన్ జావ, రాగి లడ్డు రుచి చూసి చాలా బావుందని తెలుగులో అభినందించారు. ఈ సందర్భంగా వైద్య, డిఆర్డీఏ, మత్స్య, వ్యవసాయ, ఉద్యాన, సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోది దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటోందని తెలిపారు. గత 10 సంవత్సరాలలో ప్రతి రంగం మిషన్ మోడ్‌లో అభివృద్దిలో ఉందని పేర్కొన్నారు. దేశంలోని ఏ మూలా కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం నిరంతర మార్గదర్శకత్వంలో పని చేస్తోందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here