సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు :సీపీ…

0
42

సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు :సీపీ…

హెలిప్యాడ్, శంకుస్థాపన, మీటింగ్ ప్రాంతాల పరిశీలన…

బిబిఎంఎ న్యూస్ /మంచిరాల ప్రతినిధి,

రేపు సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి శంకుస్థాపన సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ , పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క , ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంచిర్యాల పట్టణ కేంద్రం లో జరుగు కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి , మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్., తో కలిసి భద్రత ఏర్పాట్లు , బందోబస్తు ఏర్పాట్లను శంకుస్థాపన చేసే స్థలం, సభ వేదికను సందర్శించి భద్రత పరమైన ఏర్పాట్లను పరిశీలించారు. సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, సభకు వచ్చే మార్గాలపై అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించి మంత్రులు పర్యటించే ప్రాంతాలలో పూర్తిస్థాయిలో నిఘా, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లకు అవసరమైన చర్యలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భద్రత చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలకు, ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పర్యటన సజావుగా సాగేలా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపడుతునట్లు తెలిపారు.
కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here