ఓటు నమోదుకు ఈనెల 23, 24 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్
బిబిఎంఎ న్యూస్ /భూపాల పల్లి
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో రెండు రోజులు బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారికి నేరుగా ఓటు నమోదు కోరుతూ దరఖాస్తులు అందించవచ్చునని తెలిపారు.
ee voters.eci.gov.in ద్వారా దరఖాస్తు చేయవచ్చునని సూచించారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్య హెల్ప్ లైన్ మొబైల్ యాప్లోనూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని, ప్రత్యేక ఓటరు 2025లో భాగంగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంగం మరో అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28 వరకు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చునని, 1.1.2025 నాటికి 18 సంవత్సరాల వయసు నిండుతున్న వారు ఫాం-6లో ఓటు నమోదుకు ఆన్లైన్లో, ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను తెలిపేందుకు ఫాం-7, సవరణలు, నివాస గృహం మార్పు, కొత్త ఫొటో గుర్తింపు కార్డు, దివ్యాంగులుగా గుర్తించేందుకు ఫాం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ నెల 28 వరకు అందిన దరఖాస్తులను డిసెంబరు 24 నాటికి పరిష్కరిస్తారని అన్నారు. జనవరి,
2025 జనవరి 6న ఓటరు తుది జాబితా ప్రకటించనున్నారని తెలిపారు. తుది జాబితాలో ఓటరుగా పేరు నమోదు కావాలంటే ఈనెల 28 దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.