#TELANGANA POLITICS

0
10

2024 సంవత్సరానికి ఉత్తమ అంతర్గత మత్స్యకారుల జాతీయ అవార్డును తెలంగాణ రాష్ట్రం అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులను అభినందించారు. మత్య్య పరిశ్రమల అభివృద్ధికి, చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా అందించే అవార్డు తెలంగాణ రాష్ట్రానికి దక్కింది.

కేంద్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా జాతీయ అవార్డును తెలంగాణ అధికారులు అందుకున్నారు. మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ గారు, ఆ శాఖ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక ఆల గారు సచివాలయంలో సీఎం గారికి అవార్డును అందించారు. తెలంగాణ మత్స్య శాఖ దేశంలోనే అగ్రగామిగా నిలవడంపై ఈ సందర్భంగా సీఎం గారు వారిని అభినందించారు. #TelanganaRising

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here