కమీషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో సుమారు రూ:1,30,38,600/- విలువ గల 521.544 కిలోల గంజాయి దహనం: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపియస్.,

0
11

కమీషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో సుమారు రూ:1,30,38,600/- విలువ గల 521.544 కిలోల గంజాయి దహనం: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపియస్.,

బిబిఎంఎ న్యూస్ /రామగుండం,

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా *2021 సంవత్సరం* నుండి వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన *64* కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి *521.544* కిలోలను, యన్.డి.పి.యస్. చట్ట ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని, న్యాయాధిపతుల ముందు కేసు ప్రాపర్టీని యఫ్.యస్.ఎల్. కొరకు శాంపిల్ తీసి మిగిలిన మొత్తాన్ని కమీషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో  ఈ రోజు తేది:26-11-2024 నాడు కరీంనగర్ జిల్లా మానకొండూర్ వెంకటరమణ ఇన్సినేటర్ ఫ్యాక్టరీ… వద్ద పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని, దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ సుమారు 1,30,38,600/-* రూపాయలు ఉంటుందని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి  తెలిపారు.. కమీషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ సీపీ  మరియు కమిటీ సభ్యులైన C. రాజు అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామగుండం, గోదావరిఖని ఎసిపి ఎం .రమేష్, జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఎసిపి మల్లారెడ్డి, సిసిఆర్బీ ఇన్స్పెక్టర్ జి. సతీష్ , మల్లేష్ అడ్మిన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అడిషనల్.డిసిపి అడ్మిన్ సి.రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, గోదావరిఖని ఎసిపి ఎం.రమేష్, జైపూర్ ఎసిపి ఎ.వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, ఏ.ఆర్ ఏసిపి సుందర్రావు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ ఐ లు దామోదర్ మల్లేశం లు పాల్గొన్నారు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here