గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ మరియు నీల్వాయి పోలీసుల సంయుక్త దాడులు..

0
9

గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ మరియు నీల్వాయి పోలీసుల సంయుక్త దాడులు..

బిబిఎంఎ న్యూస్ /నీల్వాయి, చెన్నూరు.

ఈరోజు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శ్రీనివాస్ ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్ మరియు సిబ్బంది కలిసి నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ బుయ్యారం గ్రామ సమీప అడవుల్లో సంయుక్త దాడులు నిర్వహించి, రహస్యంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇంటి పరిసరాలలో గుడుంబా తయారీ బట్టి నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సమీప అడవిలో గుడుంబా తయారీ కోసం కలిపి ఉంచిన 22 డ్రమ్ములలో గల సుమారు నాలుగు వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది.కొరకుప్పుల సత్యక్క,ఆడే లింగు భాయ్ లను అరెస్ట్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here