డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఇద్దరికీ మూడు రోజులు పెద్దపల్లి జిల్లా కోర్టు లో క్లీనింగ్ పనులు చేయాలని శిక్ష…

0
13

 


డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఇద్దరికీ మూడు రోజులు పెద్దపల్లి జిల్లా కోర్టు లో క్లీనింగ్ పనులు చేయాలని శిక్ష…

బి బి ఎం ఎ న్యూస్ /పెద్దపల్లి,

మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు పెద్దపల్లి న్యాయమూర్తి ఎన్.మంజుల గారు తీర్పు నిచ్చారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ మొత్తం 13 మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వారిని విచారించిన న్యాయమూర్తి శ్రీ మంజుల గారు 13 మందికి 14,500/- రూపాయల జరిమానా విధించారు. అయితే అత్యధికంగా మద్యం సేవించి వాహనం నడిపిన *సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన మామిడి రమేష్ కు మరియు పెద్దపల్లి కి చెందిన పంకజ్ అను వ్యక్తులకు రూ.500/- రూపాయల జరిమానా తో పాటు సామాజిక సేవలో భాగంగా మూడు రోజులపాటు జిల్లా కోర్ట్ పెద్దపల్లి లో క్లీనింగ్ పనులు* చేయాలని తీర్పునిచ్చారు. బుధ, గురు మరియు శుక్ర వారాల్లో క్లీనింగ్ పనుల్లో ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here