నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తి కి నాలుగు రోజుల జైలు శిక్ష…5 గురికి జరిమానా

0
31

నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తి కి నాలుగు రోజుల జైలు శిక్ష…5 గురికి జరిమానా…

బిబి ఎంఎ న్యూస్ /పెద్దపల్లి,

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన డ్రంక్&డ్రైవ్ లో పట్టుబడిన 06 మందుబాబులకు ఈ రోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ కౌన్సెలింగ్ నిర్వహించి మద్యం సేవించి వాహనం నడిపితే జరిగే అనర్థాల గురించి వివరించారు. డ్రంక్&డ్రైవ్ లో దొరికిన వారికి జరిమానాలు పడటమే కాకుండా ,జైలు శిక్ష కూడ పడుతుందని వారి లైసెన్సుల రద్దు కొరకు సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు.

కౌన్సెలింగ్ అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాహనదారులను పెద్దపల్లి కోర్ట్ లో జడ్జి ముందు 6 గురిని హాజరుపరుచగా మెజిస్ట్రేట్ ఎన్ .మంజుల విచారించి 5 గురికి మొత్తం రూ.9,800/- లు జరిమానా విధించినారు.

నిన్న తేదీ 26.11.2024 నా రాత్రి కర్రల లోడ్ తో ఖమ్మం నుండి కాగజ్ నగర్ వెళ్తున్న లారీ నెం.MH34BG3625 ను లారీ డ్రైవర్ అతిగా మద్యం సేవించి పెద్దపల్లి పట్టణం లో ప్రజలు భయబ్రాంతులకు గురి అయ్యేవిధంగా లారీ ని నడుపగ , పెద్దపల్లి ట్రాఫిక్ సి.ఐ అనిల్ మరియు ట్రాఫిక్ సిబ్బంది వెంబడించి పెద్దపల్లి లోని అయ్యప్ప జంక్షన్ వద్ద లారీ ని ఆపి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని బ్రీత్ అనలైజర్ తో పరిశీలించగా 306 రీడింగ్ వచ్చింది. ఈరోజు గౌరవ జె ఎం ఫ్ సి కోర్ట్ పెద్దపల్లి లో హాజరు పర్చగా మెజిస్ట్రేట్ ఎన్.మంజుల విచారించి లారీ డ్రైవర్ నాగ్సెన్ గవండే, నివాసం.రాజురా, చంద్రపూర్ జిల్లా మహారాష్ట్ర కు 4 రోజులు జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని న్యాయమూర్తి సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here