ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన…
బిబిఎంఎ న్యూస్ / మంచిర్యాల,
నవంబర్ 27,
ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ ఉత్తర్వుల ప్రకారం ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రతిభ జూనియర్ కళాశాల మంచిర్యాల్ లోని విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ… ప్రస్తుత జీవనవిధానంలో సెల్ ఫోన్ వినియోగం చాలా పెరిగిపోయిందని అన్నారు. ప్రతినిమిషం సెల్ ఫోన్ లేనిది ఏ పని చేయలేకపోతున్నామని, ప్రతిదీ కూడా సెల్ ఫోన్ తోనే లింక్ ఉండడంతో మన సెల్ ఫోన్ నెంబర్ కూడా మన బ్యాంక్ అకౌంట్, పాన్ కార్ట్, ఆధార్ కార్డు, పెన్షన్, పౌరసరఫరాల వినియోగానికి సంబంధించి అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉంటుందని అన్నారు. సోషల్ మీడియా లో కూడా జిమెయిల్ , ఫోన్ నెంబర్ తప్పనిసరిగా రిజిస్టరు చేసుకుంటారు, సైబర్ నేరాల పట్ల, ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు డ్రగ్స్ వంటి తదితర అంశాల పై యువత, విద్యార్థునులకు పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో మహిళలు పిల్లలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. యువత ఇంటర్నెట్ ను మంచికి ఉపయోగించుకోవాలి, ఇంకా పరిమితికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా నేను విద్యార్థి మరియు విద్యార్థినులకు సూచించేదేమిటంటే మీ సెల్ లోని ప్రొఫైల్ లో ఫోటోస్, డీపీ లు ఇంకా మీ వ్యక్తిగత సమాచారం ఎవరికి చెప్పద్దు. పొరపాటున ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 కి కాల్ చేయాలని లేదా గూగుల్ లోకి వెళ్ళి www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా కూడా పిర్యాదు చేయవచ్చని తెలియజేసినారు .
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఆట్టేము శంకర్, వెంకటేష్ , కుమార్, మహిళా కానిస్టేబుల్ మౌనిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.