మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ..

0
41
Oplus_131072

*మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ..

బిబిఎంఎ న్యూస్  /పెద్దపల్లి, రామగుండం పోలీస్

కమిషనరేట్ పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లి వైపు ప్రయాణిస్తున్న లారీ డ్రైవర్ సాయంత్రం ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. మద్యం మత్తులో అతి వేగంగా అజాగ్రత్తగా కర్రల లోడ్తో ఉన్న లారీ ని డ్రైవరు జాతీయ రహదారిలో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ వాహనదారులులను ఇబ్బందు లకు గురిచేస్తూ లారీ అదుపుతప్పి రోడ్డుపై నాట్యం చేస్తున్నట్లు డ్రైవ్ చేస్తూ నడపడం చేస్తున్నాడనే సమాచారం పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ కు రాగా వెంటనే సీఐ స్పందించి అక్కడికి చేరుకోని మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా 360 పర్సెంటేజ్ రావడం జరిగింది.లారీ ని సిజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ఎవరికీ ప్రమాదం జరగకుండా వెంటనే స్పందించి ఎంతో మంది వాహనాలకు, వ్యక్తులకు ప్రాణ, ఆస్థి నష్టం కలగకుండా స్పందించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, వారి సిబ్బంది కి వాహనదారులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here