వార్షిక తనిఖీ లలో భాగంగా జైపూర్ ఏసీపీ ఆఫీస్ తనిఖీ చేసిన సీపీ..

0
24

వార్షిక తనిఖీ లలో భాగంగా జైపూర్ ఏసీపీ ఆఫీస్ తనిఖీ చేసిన సీపీ..

అక్షర వేదం /జైపూర్ మంచిర్యాల జిల్లా,

వార్షిక తనీఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ ఏసిపి కార్యాలయమును రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. ఐజి తనీఖీ చేసారు. తనీఖీ భాగంగా ఏసిపి కార్యాలయమునకు చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు ఏసీపీ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీపీ ఏసిపి కార్యాలయము నకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు, ఏసిపి అధ్వర్యంలో దర్యాప్తు జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై సీపీ అరా తీయడంతో పాటు, గ్రేవ్‌ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు జరుగుతున్న తీరును పోలీస్‌ కమిషనర్‌ ఏసిపి వెంకటేశ్వర్లు ను అడిగి తెలుసుకొవడంతో పాటు, పెండింగ్ లో ఉన్న ఎస్సి ,ఎస్ టి కేసులు, ఇతర గ్రేవ్‌ కేసుల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్బంగా జైపూర్ సబ్‌`డివిజినల్‌ పోలీస్‌ అధికారులతో కమిషనర్‌ మాట్లాడుతూ….నేరాల కట్టడి కొసం అధికారులు సమిష్టిగా సమన్వయము తో కృషి చేయాలనీ, చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితిలో వదలవద్దని, పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఎప్పటికప్పుడు విజిట్ లు చేస్తూ అన్ని రికార్డ్ లు పరిశీలించడంతో పాటు, అధికారులకు, సిబ్బంది కి సూచనలు చేయాలనీ ముందస్తూ సమాచార సేకరణ అవరమని, జైపూర్ సబ్ డివిజన్ పరిధిలో మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, మహారాష్ట్ర సరిహద్దు ఉన్నవి కావున ఎప్పుడు అప్రమత్తం గా ఉంటూ నిఘా పెట్టి సమాచార వ్యవస్థ ను పటిష్టం చేయాలనీ సూచించారు. ఏరియా డామినేషన్ లు, కూబింగ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ మారుమూల గ్రామాలను సందర్శించాలని, ఫెర్రి పాయింట్స్ విజిట్ చేయాలనీ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు తెలిపారు. పేకాట, గంజాయి, గుడుంబా తయారీ, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా, ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యాకలపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఏలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలేత్తకుండా లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ తనీఖీలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జైపూర్ డివిజనల్‌ పోలీస్‌ అధికారులు, ఇన్స్‌స్పెక్టర్‌ లు వేణు చందర్, రవీందర్, సుధాకర్, పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here