మందు బాబులపై కొరడా..! మద్యం సేవించి పట్టుబడితే జైలుకే…
బిబిఎంఏ న్యూస్ / పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి…
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు మందుబాబులపై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకనిఘా పెట్టారు. తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి జరిమానాలతో సరిపెట్టకుండా కోర్టు ముందు హాజరు పరిచి ఏకంగా జైలుకు తరలించడం జరుగుతుంది. గత కొద్ది కాలంగా పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ వారి సిబ్బంది వాహన తనిఖీలలో మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులను కోర్టు ముందు హాజరుపరచగా జడ్జి విచారించి మందుబాబులకు ట్రాఫిక్ వీధులు నిర్వహించాలని, కోర్టు క్లీనింగ్ పనులు చేయాలని, కొంతమందికి జరిమానాలు మరియు కొంతమందిని జైలు శిక్ష విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 14 మంది మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని పెద్దపెల్లి కోర్టులో హాజరుపరచగా జడ్జి ఎన్ .మంజుల విచారించి 11 మందికి రూ.11,400/- లు జరిమానా విధించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ … ప్రమాదాల నివారణే లక్ష్యంగా మందుబాబులపై ప్రత్యేక దృష్టి సారించాం అని రోడ్డు ప్రమాదలలో అత్యధికంగా జరిగేవి మద్యం సేవించి వాహనాలు నడపడం వలన అని అన్నారు. జరిమానాలు విధిస్తున్న చాలామందిలో మార్పు రావడంలేదని పలుమార్లు మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారిని కోర్టు లో హాజరు పరచగా జడ్జిగారు జైలు శిక్షతోపాటు జరిమానా లు కూడా విధిస్తున్నారు.