రామగుండంలో ఎయిర్ పోర్ట్ కావాలని కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రిని కలిసిన పెద్దపెల్లి ఎంపీ..
బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి ప్రతినిధి,
రామగుండం ప్రాంతం లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు ద్వారా ఈ పారిశ్రామిక ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది కావున
రామగుండం ఏరియాలో కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది త ద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి
ఇప్పటికే రామగుండం లో ఎన్టీపీసీ, బసంత్ నగర్, కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీ,ఆర్ ఎఫ్ సి ఎల్, గోదావరిఖనిలో సింగరేణి కోల్ మైన్స్ తొంపాటు అనేక సహజ,మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి,
ఎయిర్ పోర్ట్ ఏర్పాటు తో వీటికి సంబంధించిన కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని
రామగుండంలో ఉత్తర దక్షిణ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది ప్రజలు స్థిరపడ్డారు.. వ్యాపారం వాణిజ్యం ఉన్నత చదువుల కోసం మెరుగైన రవాణా వ్యవస్థను కోరుకుంటున్నారు అని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.