వృత్తిపరమైన జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలి.
స్టేషన్‌కు వచ్చిన బాదితులకు భరోసా ఇవ్వాలి.
నీతి నిజాయితీలతో విధులను నిర్వర్తించాలి : పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,
నూతన కానిస్టేబుల్ లకు సిపి దిశానిర్దేశం
నూతన సివిల్ కానిస్టేబుల్ లకు నియామక ఉత్తర్వులు అందజేత
బి బి ఎం ఏ న్యూస్ / రామగుండం
పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని, పోలీసింగ్ ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలని వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని బాధతో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి సూచించారు.
*రామగుండము పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ….* రామగుండము పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుండి పోలీస్ శాఖకు ఎంపికైన *392 మంది ఇందులో 236 మంది సివిల్ కానిస్టేబుళ్లు, అందులో 83 మంది సివిల్ మహిళా కానిస్టేబుళ్లు, 156 మంది ఆర్ముడ్ కానిస్టేబుళ్లు, అందులో 37 మంది ఆర్ముడ్ మహిళా కానిస్టేబుళ్లు,* వివిద పోలీస్ శిక్షణ కేంద్రాలకు శిక్షణకు వెళ్ళి 9 నెలల కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని ఈ రోజు కమీషనరేట్ కు రావడం జరిగిందని ఈ రోజు నుండి కొత్తగా విధుల్లో చేరనున్న కానిస్టేబుళ్లకు బాధతో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలని దిశానిర్దేశం చేశారు. విధి నిర్వహణలో కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యమివ్వాలన్నారు. పోలీసు శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపిక చేయబడిని ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికా కుండా నీతి నిజాయితీతో విధులు నిర్వహిస్తే ప్రజలు ఆదరిస్తారన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగం అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. పోలీస్ జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమైనదని, అధికారులు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.. ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ ,నిబద్దత తో పనిచేసి పోలీస్ వ్యవస్థకు కృషి చేయాలని, కమీషనరేట్ కు, తెలంగాణ పోలీస్ కు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఎ ఆర్ ఏసీపీ సుందర్ రావు, ఎఓ అశోక్ కుమార్, ఆర్ఐ లు దామోదర్, మల్లేశం, వామన మూర్తి, శ్రీనివాస్, సూపరిండెంట్ల ఇంద్ర సేనా రెడ్డి, మనోజ్ కుమార్,సంధ్య, ఇన్స్పెక్టర్ లు, ఆర్ ఎస్ ఐ లు పాల్గొన్నారు.