*ఆస్తి కోసమే మహిళా కానిస్టేబుల్ ను హత్య చేసిన తమ్ముడు*
బిబిఎంఎ న్యూస్ /రంగారెడ్డి: డిసెంబర్ 02
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలోని మన్నెగూడలో మహిళా కానిస్టేబుల్ హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది.ఆస్తి కోసమే నాగమణిని తమ్ముడు పరమేష్ హత్య చేసినట్టు తెలుస్తుంది.
నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానై చూసుకున్నాడు.సోదరుడు పరమేష్. అయితే నాగమణికి ఇదివరకే వివాహం జరిగింది.
మొదటి భర్తతో విడాకులు కూడా తీసుకుంది. మొదటి వివాహం సమయంలో తమ వారసత్వ భూమిని తమ్ముడికి ఇచ్చింది నాగమణి. కొద్దిరోజుల తర్వాత శ్రీకాంత్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది.
తమ్ముడికి ఇచ్చిన భూమి నుంచి వాటా ఇవ్వాలని తమ్ముడు పరమేష్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది.ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు సమాచారం. దీంతో కొద్దిరోజుల నుంచి రగిలిపోతున్న పరమేష్ సోమవారం రోజు ఉదయం స్కూటీపై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో డ్యూటీకి వెళ్తుండగా మొదట నాగమణిని కారుతో ఢీకొట్టాడు.
నాగమణి కింద పడిపోగానే కత్తితో మెడ పై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు పరమేశును అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తున్నారు..