గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం…  నిర్మల్ జిల్లా ఎస్ పి…

0
13

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం… నిర్మల్ జిల్లా ఎస్ పి…

70 లక్షల విలువ గల గంజాయి సాగు మొక్కలు స్వాధీనం..గంజాయి సాగుపై ఉక్కు పాదం…

బిబిఎంఏ న్యూస్ /కడెం…

నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపల్లి పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో గంజాయి సాగు చేస్తున్న పలువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోలీసు అధికారులతో కలిసి గంజాయి సాగు పంటలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 70 లక్షల విలువచేసే గంజాయి మొక్కలను జప్తు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వాహనాలు కూడా వెళ్లలేని ప్రదేశంలో గంజాయి సాగు చేస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి మొక్కలు సాగు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎక్కడైనా ఇలాంటి పంటలు సాగు చేసినట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి సాగు చేస్తున్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here