టీజీఎంసీ అధికారుల తనిఖీలు 

0
21

 

01-12-2024 రోజున టీజీఎంసీ అధికారుల తనిఖీలు

 

👉హైదరాబాద్ రామంతాపూర్ లో రిజిస్టర్డ్ వైద్యుడి పేరు మీద చికిత్స చేస్తున్న నకిలీ వైద్యుడి గుట్టురట్టు చేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్

 

👉 డాక్టరు గా పేర్కొని ప్రెస్క్రిప్షన్ రాస్తూ టీజీఎంసీ అధికారులకు పట్టుబడ్డ రామంతాపూర్ RMP / PMP అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి

 

👉 డిస్టిల్ వాటర్ నే మందుగా పేర్కొంటూ ఇంజెక్షన్స్ ఇస్తున్న నకిలీ వైద్యుడు యాదగిరి

 

👉 ఉప్పల్ లోని బీరప్పాగూడ లో అంజలి క్లినిక్ లో డాక్టరు అని పేర్కొంటూ చిన్న పిల్లలకు సైతం స్టేరోయిడ్స్, ఆంటీ బయోటిక్ సిరప్స్ ఇస్తున్న నకిలీ వైద్యుడు బి.శ్రీను

 

👉 అంజలి క్లినిక్ లో వందల సంఖ్యలో నొప్పి నివారణ ఇంజక్షన్స్, ఆంటీ బయోటిక్ సిరప్స్ స్వాదీనం.

 

👉మెడికల్ స్టోర్ లైసెన్స్ లేకున్నా నకిలీ వైద్యులకు , అనుమతి లేని క్లినిక్ లకు మందులు సప్లై చేస్తున్న బోడుప్పల్ లోని మెడికల్ ఏజెన్సీలు

 

👉తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కమీషనర్ కమలహాసన్ రెడ్డి కి వెంటనే ఫిర్యాదు చేసిన డా నరేష్ కుమార్

 

👉 బీరప్పాగుడా లో అనుమతి లేని మరో డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు అయిన ల్యాబ్ టెక్నీషియన్స్ పైన కూడా కేసు నమోదు.

 

తెలంగాణా వైద్య మండలి అధికారులు నకిలీ వైద్యులు అయిన RMP / PMP సెంటర్స్, అనుమతి లేని డయాగ్నోస్టిక్ సెంటర్స్ పైన తనిఖీల వేగం పెంచారు.

 

హైదరాబాద్ మహా నగరం లో కూడా నకిలీ వైద్యులు గల్లీ గల్లీ కి శంకర్ దాదా లు ఎక్కువై పోయారు.

 

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కి వచ్చిన ఫిర్యాదుల మేరకు కౌన్సిల్ మెంబెర్స్,

పి ఆర్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్, సి పి డి కమిటీ చైర్మన్ డా ప్రతిభ లక్ష్మి, HRDA రాష్ట్ర నాయకులు డా బి. వంశీ కృష్ణ లు హైదరాబాద్ లోని ఉప్పల్ దగ్గర లో ఉండే రామంతాపూర్, బీరప్ప గూడ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

 

1.రామంతాపూర్ నెహ్రు నగర్ ప్రాంతంలో SVL క్లినిక్, డా నర్సింహా చారి, MBBS పేరు మీద అనుమతి తీస్కొని నకిలీ వైద్యుడు ఆవంచ సురేష్ మాత్రమే రోజూ ఉంటూ తానే డాక్టరు గా చెప్పుకుంటూ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో వైద్య పరంగా ఎటువంటి విదర్హత లేకుండా చికిత్స చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు,

డా నర్సింహా చారి కి నోటీసు ఇవ్వడం తో పాటు నకిలీ వైద్యుడు ఆవంచ సురేష్ పై కేసు నమోదు చేయనున్నారు.

 

2.అదే ప్రాంతంలో శ్రీ బాలాజీ ఫస్ట్ ఎయిడ్ నిర్వాహకుడు తురగా నాగేశ్వర్ రావ్ నొప్పి నివారణ ఇంజెక్షన్స్, ఇతర షెడ్యూల్ H మందులు చట్ట విరుద్ధంగా ఆశాస్త్రీయంగా పేషెంట్లకి ఇస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేయనున్నారు.

 

3.రామంతాపూర్ లోని రామ్ రెడ్డి నగర్ లో రామంతాపూర్ RMP అసోసియేషన్ ప్రెసిడెంట్, ఉషోదయ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు యాదగిరి డాక్టరు అని పేర్కొంటూ, ప్రెస్క్రిప్షన్స్ రాస్తూ చట్ట విరుద్ధంగా మందులు రాయడం తో పాటు డిస్టిల్ వాటర్ వయల్స్ ని వందల సంఖ్యలో నిల్వవుంచి వాటినే సూది మందులాగ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు, వాటితో పాటు ఆంటిబయోటిక్ ఇంజెక్షన్స్, స్టేరాయిడ్ ఇంజెక్షన్స్ పేషెంట్స్ కి వాడుతున్నట్టు తగు ఆధారాలు సేకరించారు.

 

4.ఉప్పల్ ప్రాంతంలో బీరప్ప గూడా వద్ద నకిలీ వైద్యుడు బి. శ్రీను డాక్టర్ అని పేర్కొంటూ మందుల ప్రెస్క్రిప్షన్ రాయడం తో వందల సంఖ్య లో నొప్పి నివారణ ఆంపుల్స్, పిల్లలకి వాడే ఆంటిబయోటిక్స్ సిరప్ లు, స్టేరాయిడ్ వయల్స్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుండి ఎటువంటి అనుమతులు లేకుండా VIEE LAC గ్రూప్ హెల్త్ కేర్ ఏజెన్సీ, బోడుప్పల్ నుండి చట్ట విరుద్ధంగా తీసుకోచ్చి నిల్వ ఉంచి వాడుతున్నట్టు గుర్తించామని సదరు మెడికల్ ఏజెన్సీ పైన డ్రగ్ కంట్రోల్ కంట్రోల్ కమీషనర్ శ్రీ కమల్ హాసన్ రెడ్డి గారికి వెంటనే ఫిర్యాదు చేశామని వారు కూడా సత్వరమే స్పందించారని డా నరేష్ కుమార్ తెలియ చేసారు.

 

5.అదే ప్రాంతంలో శ్రీ ధనవంతరి డయాగ్నోస్టిక్ ని తనిఖీ చేయగా వారివద్ద వైద్య శాఖ అధికారుల అనుమతులు లేకపోగా డా లీల సాంబ్రాని, పాతాలజిస్ట్ డిజిటల్ సిగ్నేచర్ వాడడం తో పాటు వందల కొద్ది టెస్టులను నకిలీ వైద్యుల ప్రోత్సాహంతో చేస్తునట్టు గుర్తించామని డా. లీల సాంబ్రాని కి నోటీసు పంపడం తో పాటు అనుమతి లేకుండా డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వహిస్తున్న శ్రీధర్, పరమేష్ లపై కేసు నమోదు చేయనున్నట్లు తెలియ చేసారు.

 

నకిలీ వైద్యులపై NMC చట్టం 34,54 ప్రకారం కేసు నమోదు చేయడం తో పాటు అనుమతి లేని క్లినిక్ లు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ సీజ్ చేయాలనీ మేడ్చల్ మల్కాజిగిరి వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేయనున్నామని, నకిలీ వైద్యుడితో నిర్వహింప బడుతున్న SVL క్లినిక్ అనుమతి రద్దు చేయాలని సిఫార్సు చేయనున్నట్లు డా ప్రతిభ లక్ష్మి తెలియ చేసారు.

 

హైదరాబాద్ తో పాటు, ఇతర జిల్లాల్లో కూడ చాలా వరకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ వైద్య ఆరోగ్య శాఖ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని, వారు నకిలీ వైద్యులను చట్టవిరుద్ధంగా ప్రోత్సహిస్తూ వారు రాసిన టెస్టులు చేయడం తో పాటు కమీషన్స్ ఇస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందని అటువంటి అన్ని సెంటర్స్ పై నిఘా పెంచి వాటిని సీజ్ చేసే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకి సిఫార్సు చేస్తామని హెల్త్ కేర్ రే్ఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ / HRDA రాష్ట్ర నాయకులు డా బి వంశీ కృష్ణ తెలియచేసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here