లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న మనాలి ఠాకూర్…
బిబిఎంఎ న్యూస్ /రామగుండం…
గోదావరిఖని స్థానిక కోదండ రామాలయంలో సింగరేణి ఉద్యోగి భాస్కర్ కిరణ్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం వేదం పండితుల మంత్రోచ్ఛరణలు మధ్య నిర్వహించడం జరిగినది. రామగుండం నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి ఈ రామగుండం ప్రాంత ప్రజలకి సింగరేణి కార్మికులకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భారీ ఎత్తున సింగరేణి కార్మికులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.