ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు 

0
13

ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

బి పి ఎం ఏ న్యూస్ /కోరుట్ల డిసెంబర్ 4:

మల్లాపూర్ మండలంలో జరిగిన మూ డు దొంగతనంలలో ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.గత నెల16 న రాత్రి మల్లా పూర్ మండల కేంద్రంలో రెండు షట్టర్లు పగులగొట్టి లోపల ఉన్న సుమారు 34 తులాల వెండి ని దొంగిలించుకుని పారి పోయిన దానిలో మరియు గత నెల12 తారీఖు న రాత్రి మల్లాపూర్ మండలం లోని చిట్టాపూర్ గ్రామంలో బుక్క రాజే శం అయ్యవారు అతను ఇంటికి తాళం వేసి తన బంధువుల ఇంటికి వెళ్ళగా ఆ రోజు రాత్రి గుర్తు తెలియని దొంగలు అట్టి ఇంటి తాళమును పగలగొట్టి లోపల ఉ న్న బీరువాను పగులగొట్టి బీరువాలో ఉ న్న10000 పదివేల రూపాయల నగదు ను దొంగిలించుకుని పారిపోయిన దాని లో మరియు గత నెల 11తారీఖు న రాత్రి ముత్యంపేట గ్రామ శివారులో వ్య వసాయ భూమిలో ఒక హార్వెస్టర్ ఆగి ఉండగా అట్టి హార్వెస్టర్ యొక్క పని ముట్లను సుమారు 30 వేల రూపాయల విలువగల సామాన్లు దొంగిలించుకొని పారిపోయిన కేసులలో దొంగల గురించి రెండు రోజుల నుండి మండలంలో చు ట్టుపక్కల ఉన్న రోడ్లమీద వాహనాలు తనిఖీ చేపట్టుచుండగా బుధవారం సా యంత్రం వచ్చిన సమాచారం మేరకు సీ ఐ నిరంజన్ రెడ్డి మరియు మల్లాపూర్ ఎస్సైకిరణ్ కుమార్ మరియు సిబ్బం దితోముత్యంపేట వద్ద వాహనములు తనిఖీ చేయుచుండగా ఒక బైక్ పై ము గ్గురు వ్యక్తులు ఒక సంచి పట్టుకొని రాగా వారిని ఆపి ముగ్గురి వద్ద తనిఖీ చేయ గా ఒకరి వద్ద సంచిలో హార్వెస్టర్ కు సం బంధించిన పనిముట్లు ఉండగా మరి యు రెండవ వ్యక్తి వద్ద 7వే ల రూపా యలు నగదు ఉండగా మూడో వ్యక్తి వద్ద ఒక పట్టగొలుసుల జత మరియు 3 వేల రూపాయల నగదు ఉండగా వారిని పో లీసులు విచారించగా ఒకరు గండ్ల మై పాల్ రెండవ వ్యక్తి పేరు ఎన్రాల సాయి కుమార్ మూడవ వ్యక్తి పేరు కర్రోళ్ల రాకే ష్ గ్రామము ముత్యంపేట మల్లాపూర్ ముత్యంపేట చిట్టాపూర్ గ్రామంలో జరి గిన దొంగతనములు మేమే చేసినామని ఒప్పుకొని అట్టి దొంగతనంల కోసం ఇట్టి బైక్ ను తీసుకొని వెళుతున్నామని పోలీ సులకు దొరకకుండా వెండిని మరియు హార్వెస్టర్ యొక్క పని ముట్లను ఎక్క డైనా అమ్ముకొని కొద్ది రోజులపాటు ఎక్క డికైనా వెళ్లి పోదామని నిర్ణయించుకొని వచ్చు చుండగా పోలీసులు పట్టుకున్నా రని తెలుపారు వారి వద్ద ఉన్న నగదు ను వెండిని మరియు హార్వెస్టర్ యొక్క పనిముట్లను స్వా ధీనపరచుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించుచున్నాము వారి వద్ద నగదు పదివేల రూపా యలు మరియు సుమారు 5000 రూపాయల విలువగల వెండి పట్ట గొలుసులను మరియు 30 వేల రూపాయల హార్వెస్టర్ యొక్క పని ముట్లను కోర్టులో డిపాజిట్ చేస్తామని సీ ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ సమావేశంలో మల్లాపూర్ ఎస్సై కిర ణ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here