ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మల్టీ జోన్-I ఐజి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి , ఐపిఎస్../
బీబీఎంఎ న్యూస్/ పెద్దపల్లి ప్రతినిధి,
పెద్దపల్లి జిల్లా పట్టణ పరిధిలో డిసెంబర్ 4 న
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన మల్టీ జోన్-I ఐజి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సభా ప్రాంగణాన్ని సందర్శించి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా, ఐజి సభా ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు, వేదిక నిర్వహణ, విఐపీ ప్రాంతాల సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు పరిశీలించారు. విఐపీల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, ఇతర ఏర్పాట్లు పై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులు, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రాంతాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ప్రజల ఎలాంటి ఇబ్బంది లు కలగా కుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రత అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.
పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్,రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ ఐపిఎస్., మెదక్ ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్., మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపీఎస్., కొమరం భీమ్ అసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాస్, ఏసిపిలు పాల్గొన్నారు.