బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన వారిపైన, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు హెచ్చరించారు.
బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టించిన ఓ వ్యక్తికి శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కొర్టు జడ్జి వారు 14 రోజులు జైలు శిక్ష విధించారు. బుధవారం శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో కండ్ర విధికి చెందిన బొమ్మలాట హరికృష్ణ (రౌడి షీటర్) బహిరంగంగా మద్యం సేవించడంతో పాటు, ప్రజలతో ఇబ్బందికరంగా ప్రవర్తించి న్యూసెన్స్ సృష్టించడంతో సదురు వ్యక్తిని గుర్తించి శ్రీకాకుళం వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.ఈ క్రమంలో శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు గౌరవ జడ్జి శివ రామ కృష్ణ గారు బి.హరికృష్ణ కు బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టించినందుకు 14 రోజులు జైలు శిక్ష విధించారు. బి.హరికృష్ణ పై శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడి షీట్ తెరిచి ఉంది.
@APPOLICE100