- ♦️విపత్తు సమయాల్లో సుశిక్షితులైన బృందాలు తక్షణం రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా కొత్తరూపు సంతరించుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) విభాగాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో స్పందించడానికి వీలుగా ఆ విభాగానికి కొత్తగా సమకూర్చిన వాహనాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
♦️వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల వంటి విపత్తులను ఎదుర్కొనడానికి (NDRF) తరహాలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను సిద్దం చేశారు. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌డీఆర్ఎఫ్ కోసం కొనుగోలు చేసిన అగ్నిమాపక, అత్యవసర అధునాతన వాహనాలను ప్రారంభించారు. ఈ దళానికి పలు పడవలను కూడా సమకూర్చగా, హుస్సేన్‌సాగర్‌లో ఆ బోట్ల ద్వారా ప్రదర్శన ఇచ్చారు.
♦️అనంతరం హోం శాఖ నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఎస్ డీఆర్ ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.