➡️ జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం… అంటూ యావత్ తెలంగాణ జాతిని జాగృతపరిచిన కవి ఒకరు…
➡️ తెలంగాణ జాతికి ఒక గుర్తింపు, అస్థిత్వం, మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతిరూపం తల్లి. ఆ తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త ఇంకొకరు…
➡️ తెలంగాణ చరిత్రను చాటుతూ ఆ రూపానికి జీవం పోసి నిత్యం స్ఫూర్తిదాయకంగా ప్రజల ముందు ఆవిష్కరించిన శిల్పి మరొకరు…
➡️ ఈ ముగ్గురు ప్రముఖులను ప్రజా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తర్వాత జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి @revanth_anumula గారు, ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారి చేతుల మీదుగా అందెశ్రీ గారిని సత్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఆచార్యులు గంగాధర్ గారిని, శిల్పి, జాతీయ లలిత కళా అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడు ఎంవీ రమణారెడ్డి గారిని సత్కరించారు.
➡️ ఈ కార్యక్రమంలో మొత్తం మంత్రిమండలి సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #TelanganaRising #TelanganaThalli #AndheSri