వజ్ర వాహనం ఉపయోగం గురించి వివరించిన పోలీస్ కమిషనర్…

0
12

వజ్ర వాహనం ఉపయోగం గురించి వివరించిన పోలీస్ కమిషనర్…

బీబీఎంఏ న్యూస్  / రామగుండం ప్రతినిధి

ఈ రోజు నూతన సాయుధ దళ (ఎఆర్) కానిస్టేబుళ్ళకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఎఆర్ పోలీసు విధులలో బాగంగా అల్లర్ల సమయంలో ఉపయోగించే పోలీస్ వజ్ర వాహనం గురించి అవగాహనా కల్పించడం జరిగింది. రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అల్లర్లు జరిగే సమయంలో స్మోక్, స్టన్ గ్రైనేడ్ (భారీ శబ్దం తో కూడిన) సెల్స్ ఏవిదంగా ఫైర్ చేయాలనీ స్వయంగా ఫైర్ చేసి వివరించడం జరిగింది.

ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ ….. పోలీస్ వజ్ర వాహనం ప్రధానంగా తీవ్రమైన అల్లర్లు చోటుచేసుకున్న సమయంలో అల్లరి మూకలను చెదరగొట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని పోలీసులకు వజ్రాయుధంలా ఉపయోగపడుతుంది అని అన్నారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఒకేసారి ఈ వజ్రా వాహనం ద్వారా ఏడు సెల్స్ ఉపయోగించి ఫైర్ చేసి పరిస్థితిని చక్క దిద్దడం జరుగుతుందన్నారు.

ఈకార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏ ఆర్ ఏసిపి సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సంపత్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here