- రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు కృషి….జిల్లా కలెక్టర్..
సింగరేణి భూ సేకరణ పరిహారంపై సంబంధిత రైతులతో చర్చించిన కలెక్టర్…
బిబిఎంఏ న్యూస్ / పెద్దపల్లి, డిసెంబర్-13:
భూసేకరణ కింద భూములు అందించే రైతులకు నిబంధనల ప్రకారం సింగరేణి సంస్థ ద్వారా మెరుగైన పరిహారం అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శుక్రవారం కోర్టు ఆదేశాల ప్రకారం రైతులు, సింగరేణి సంస్థ ప్రతినిధులతో సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సింగరేణి భూ సేకరణ పరిహారం పై సంబంధిత రైతులతో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ డి.వేణు కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,.రామగిరి మండలం సుందిల్ల , ముత్యాల గ్రామాలలో సింగరేణికి సంబంధించిన భూసేకరణ అంశంపై రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, సింగరేణి జిఎం 1 లలిత్ కుమార్ , రామగిరి తహసిల్దార్ ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.