ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య.
*బాలకార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ నిర్మూలన, కార్మికుల పిల్లలకు తప్పనిసరిగా విద్య పోలీస్ ప్రధాన ధ్యేయం: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్.,
ఇటుక బట్టిల్లో పని చేసే వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యంగా *వర్క్ సైట్ స్కూల్* పేరుతో పాఠశాలలు ప్రారంభించినట్లు రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్., ఐజి పేర్కొన్నారు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్, ఐపిఎస్., ఐజి గారి ఆధ్వర్యంలో బాలకార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ నిర్మూలన, కార్మికుల పిల్లలకు తప్పనిసరిగా విద్య పోలీస్ ప్రధాన ధ్యేయంగా ఇటుక బట్టీలలో పలక బలపం పట్టవల్సిన చీట్టి చేతులు ఇటుక బట్టీలలో తల్లితండ్రులతో కలిసి ఇటుకలను చేస్తూ, మోస్తున్న కార్మికుల పిల్లల పరిస్థితి తెలిసి ఇటుక బట్టి యజమానులతో మాట్లాడి కార్మికుల బాగోవులు చూడడంతో పాటు వారి పిల్లలను కార్మికులుగా మార్చవద్దని ఖచ్చితంగా వారికి విద్యాభ్యాసం కల్పించాల్సిందేనని ముఖ్య ఉద్దేశ్యం తో ఏర్పాటు చేసిన *వర్క్ సైట్ స్కూల్* క్లాస్ రూములను పోలీస్ కమీషనర్ గారు పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు.
అనంతరం సిపి గారు మాట్లాడుతూ…. వలస కార్మికులు బతుకు దెరువు కోసం స్వరాష్ట్రం వదిలి వేలాది కిలోమీటర్ల దూరం వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. వారి పిల్లలు సైతం వారి చెంతనే ఉంటూ భవిష్యత్తు కార్మికులుగా మారుతున్నారు. వలస కార్మికులు పొట్ట కోటి కోసం స్వరాష్ట్రం వదిలి ఇటుక బట్టీ లలో పని చేసేందుకు వచ్చారని, కార్మికులతో పాటు వారి పిల్లలు విద్యాభ్యాసం మాని బట్టిల్లో పని చేయడం సరికాదన్నారు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని యజమానులతో మాట్లాడి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని పాఠశాలలు ప్రారంభించామన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం పోలీస్ శాఖ నుండి తమ వంతు సహకారం అందిస్తామని చిన్నారులకు నాణ్యమైన విద్య అందించాలని సదుద్దేశంతో ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ఏర్పాటు చేసినట్లు సిపి గారు తెలిపారు. ఇక్కడ 70 మంది పిల్లలు ఉన్నారు వాళ్లకి ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒరిస్సా భాషలో నేర్పించడానికి ఒరిస్సా నుంచి టీచర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని ఇటుక బట్టిలలో త్వరలో *వర్క్ సైట్ స్కూల్* ఏర్పాటు చేసేలా చూస్తాం అని సిపి గారు తెలిపారు. విద్యార్థులకు స్వయంగా పుస్తకాలు ఇతర సామాగ్రి పంపిణీ చేశారు. పిల్లలందరూ మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని పెద్దయ్యాక ఏమవుతారు అని పిల్లలు అడగగా పోలీస్ అని చెప్పారు వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరాలని పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాను అని సీపీ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్., పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్, బసంత్ నగర్ ఎస్సై స్వామి,తదితరులు పాల్గొన్నారు.