- అలరించిన సైన్స్ ఫెయిర్…!
విద్యార్థులను అభినందించిన కలెక్టర్
బిబిఎంఎ న్యూస్/గోదావరిఖని: డిసెంబర్ 13
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టిపిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సైన్స్ ఫెయిర్ లో ఆసక్తిగా పాల్గొన్న విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా సైన్స్ అధికారి రఘునందన్ రావు, మండల విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.