ఆటో లో అక్రమంగా రవాణా చేస్తున్న 06 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

బిబిఎం న్యూస్  /మంచిర్యాల్

రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా సీసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కార్నర్ వద్ద, మంచిర్యాల నుండి చెన్నూర్ వైపుగా ఆటో (TS15TV 2214 ) ద్వారా అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తి ని అదుపులోకి తీసుకుని, ఆటోలో తరలిస్తున్న సుమారు 6 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి విలువ సుమారు 18,000/- రూపాయలు.

*నిందితుడి వివరాలు*

1) వానరాసి అశోక్ s/o కిష్టయ్య , : 22 సం ఎన్టీఆర్ర్ నగర్ , మంచిర్యాల్.

స్వాదినపరుచుకున్న 06 క్వింటాళ్ల పిడిఎఫ్ రైస్, ఆటో మరియు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం సీసీసి నస్పూర్ ఎస్ఐ గారికీ అప్పగించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here