*రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేల విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు..
వి బి ఎం ఏ న్యూస్ /రామగుండం కమిషన్ రేట్
*గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపల్లి పట్టణలలో క్షేత్ర స్థాయిలో సందర్శించిన పోలీస్ కమీషనర్
*విధులలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పోలీస్ కమిషనర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు.*
గోదావరిఖని పట్టణలోనీ గాంధీ చౌక్, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ లో పెద్దపల్లి పట్టణం లో విధులలో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బంది కి మరియు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి
కమీషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ గోదావరిఖని, పెద్దపల్లి పట్టణం లో మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడ్మిన్ అడిషనల్ డీసీపీ రాజుతో కలిసి గోదావరిఖని ఏసీపీ రమేష్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, ఇతర అధికారులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది కి సూచించారు. నూతన సంవత్సరం వేడుకల్లో ఎటువంటి అవంచానియా సంఘటనలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్. తనిఖీలు నిర్వహించినట్లు, శాంతి భద్రతలకు భంగం కలుగకుండా కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు గొడవలు కు తవివ్వకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సీపీ పేర్కొన్నారు. మద్యం సేవించి పట్టు బడిన వారికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.