కమీషనరేట్ పరిధి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సీపీ సమీక్షా సమావేశం..

0
24

కమీషనరేట్ పరిధి వివిధ శాఖల అధికారులతో సీపీ సమీక్షా సమావేశం…

బీబీఎంఏ న్యూస్ / రామగుండం,

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడ జనవరి ఒకటో తారీకు నుండి 31 వ తారీకు వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ -XI ను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేసి విజయవంతం చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి వివిధ డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులను కోరారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ కమీషనర్ అధ్యక్షత నా ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖ లతో నిర్వహించిన సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…. ఆపరేషన్ స్మైల్ -XI లో పాలుపంచుకొంటున్న ఒక్క అధికారి ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయాలనీ కోరారు. ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనదని, దానిని అనుభవించటం ప్రతీ పౌరుని హక్కు అని అన్నారు. కానీ క్షణికావేషంలో పిల్లలు తొందరపాటులో చిన్న చిన్న విషయాలకే తల్లి దండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని, ఇట్టి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిని ప్రమాదకర పనుల్లో వారితో పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పి పోయిన పిల్లలను వెతికి ‘దర్పణ్ ‘ అప్లికేషన్ ద్వారా వారిని గుర్తించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి ,తిరిగి తల్లి దండ్రుల వద్దకు చేర్చి వారి శోకాన్ని తీర్చాలని అన్నారు. బిక్షాటన చేస్తున్న వారి గురించి, బాలకార్మికుల గురించి ఎప్పటి కప్పుడు సమాచారం ఇవ్వడానికి చైల్డ్ హెల్ప్ లైన్ కు చెందిన 1098,112 నెంబర్ల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. ప్రతీ పోలీస్ డివిజన్ స్థాయిలో ఒక సబ్-ఇన్స్పెక్టర్ తో పాటుగా ఒక మహిళా పోలీస్ అధికారి, నలుగురు సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో నెల రోజుల పాటు ఇదే పనిపై ఇటుక బట్టి లు, వివిధ రకాల పరిశ్రమలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబాలకు దూరంగా ఉంటున్న పిల్లలను గుర్తించాలని అన్నారు. స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లి దండ్రులకు నచ్చ చెప్పి తిరిగి వారిని పాఠశాల కు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని అన్నారు.

ఈ సమావేశం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు ఎ.సి.పి. మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్- రమేష్ బాబు, ఎస్.ఐ- రాజేష్, శైలజ, లచ్చన్న, శరణ్య, సి.డబ్లు.సి ఛైర్మెన్-శ్రీధర్, డీ.ఏం & హెచ్.ఓ- అన్నప్రసన్న కుమారి, లేబర్ ఆఫీసర్- హేమలత & సత్యనారాయణ, డి.సి.పి.ఓ- కమలాకర్ & ఆనంద్, పి.ఓ- జితేందర్, డి.ఇ.ఓ సెక్టర్ ఆఫీసర్ – సత్యనారాయణమూర్తి & అజీముద్దీన్ దబీర్, సంజీవయ్య, లీగల్ ప్రొబేషనరీ ఆఫీసర్- రజీత, చైల్డ్ లైన్- ఉమాదేవి, రమాదేవి & ప్రవీణ్ కుమార్, సి.డబ్లు.సి మెంబర్-శ్యామ్ సుందర్, సుమలత మరియు సబ్ డివిజనల్ ఇన్చార్జి మరియు టీం సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here