✳️ నిర్మల్ చరిత్రపై పరిశోదనలు జరిపి భవిష్యత్ తరాలకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మాహిళా, శిశు, సంక్షేమ శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
✳️ వినూత్నంగా జిల్లాలో నిర్మల్ ఉత్సవాల పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ను మంత్రి అభినందించారు.
✳️ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు.
✳️ అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి సంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.
✳️ అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లా చరిత్రను ప్రపంచానికి తెలియజెసేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
✳️ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీలు అవినాష్, రాజేష్ మీనా, ఉపేంద్ర రెడ్డి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
#NirmalUtsavalu
@TelanganaCMO
@meeseethakka
@TelanganaCS
@IPRTelangana
@Abhilasha18IAS