షీ టీమ్స్ ఎల్లప్పుడూ మహిళా రక్షణ కు అందుబాటులో ఉంటాం…
మీ రక్షణ మా బాధ్యత..మంచిర్యాల డీసీపీ,
బిబిఎంఎ న్యూస్ //మంచిర్యాల, రామగుండం కమిషనరేట్,
రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని షీ టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్ మరియు భరోసా సెంటర్ అధికారులు, సిబ్బంది తో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ డీసీపీ కార్యాలయం లో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ మంచిర్యాల జోన్ పరిధి షీ టీమ్స్ ప్రధానంగా హాట్ స్పాట్స్ ను ప్రతి రోజు సందర్శించడం, స్కూల్స్ మరియు కళాశాలలో అదేవిధంగా ప్రధాన కూడళ్ల వద్ద మహిళా భద్రత ఫై అవగాహన కార్యక్రమాలు మరియు మహిళా యువతలో ఉండే హాస్టల్స్ మరియు ఉమెన్ వర్కింగ్ హాస్టల్స్ లను సందర్శించి అక్కడ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా, సెక్యూరిటీ గార్డ్, ఒక మహిళ ఇన్చార్జి తప్పనిసరిగా ఉండేలా చూడాలి అదేవిధంగా అక్కడ పనిచేసే వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
భరోస కేంద్రాలలో బాధిత మహిళ లేదా బాలికకు వైద్యం, కౌన్సిలింగ్, అన్ని రకాల సేవలు అందించడంతో పాటు మీకు అండగా పోలీస్ ఉందనె మనోధైర్యాన్ని కల్పించాలి. భరోసా సెంటర్లో లీగల్ అడ్వైజర్, కౌన్సిలర్, మెడికల్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. లైంగిక వేధింపులకు గురైన మహిళలు లేదా బాలికల కు సంబందించిన కేసు పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన సమయం నుండి బాధితులకు సపోర్టుగా వారి మానసిక పరిస్థితి, వారి విద్యా పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ ఉండాలి.
ఈ సమీక్ష సమావేశంలో మైలా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, మంచిర్యాల జోన్ షీ టీం ఇన్చార్జి మహిళా ఎస్సై హైమ, భరోసా సెంటర్ సిబ్బంది మరియు షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.