సభా స్థలం ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్,.

బిబిఎంఏ న్యూస్  //రామగుండం కమిషనరేట్,

పెద్దపల్లి జిల్లా ఎన్టిపిసి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల జ్యోతి నగర్ లో జనవరి 28వ తేదీన జరిగే నూతన 2400 మెగావాట్ల కొత్త ప్లాంట్ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం కార్యక్రమం కోసం ఏర్పాట్ల ను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి, కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్ తో కలిసి సభ వేదిక ప్రాంతం, స్టేజ్ ఏర్పాటు, విఐపి జనరల్ పార్కింగ్ స్థలాలు, ఎక్కడ ఎక్కడా బ్యారికేటింగ్ ఏర్పాట్లు, సమావేశం కు వచ్చే వారికోసం ఏర్పాటు చేసిన భోజనాలు ఏర్పాటు ప్రదేశంను, ప్రజలు సభకు వచ్చే మార్గాలను సందర్శించి, పలు ప్రాంతాల నుండి సమావేశం కు వచ్చే వాహనాలకు, ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, సమావేశం సజావుగా సాగేలా కట్టుదిట్టమైన ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించి పోలీస్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏ సిపిఎం రమేష్,ట్రాఫిక్ ఏసీపీ జాడి నరసింహులు, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్ టి పి సి ఎస్ ఐ లు ఉదయ్ కిరణ్, మానస, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here