వరంగల్/ నెక్కొండ: 2 ఫిబ్రవరి 2025
ఆదివారం నెక్కొండ మండలం లోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల, ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ ఎస్సి బాలుర, బాలికల వసతి గృహం, పెద్ద కొర్పోల్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కెజిబివి) లను స్థానిక తాసిల్దారు రాజ్ కుమార్ తో పాటు సందర్శించి. వసతి గృహాల్లో రిజిస్టర్లు, వంట గదిని, డైనింగ్‌హాల్ ను, స్టోర్ రూమ్ లలో సరకులను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించడమైనది.
నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని,మెనూ ను కచ్చితంగా అమలు చేయాలని,భోజనం తయారు కోసం నాణ్యమైన వస్తువులను వినియోగించుకోవాలని సూచించడమైనది.
వంట చేసే సిబ్బంది వ్యక్తిగత శుభ్రతతో పాటు డైనింగ్ కిచెన్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, శుభ్రత పాటించని యెడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగునని, సంబంధిత సిబ్బందిని ఆదేశించడమైనది.
వసతి గృహాలలో నిర్వహణ సక్రమంగా జరగకపోవడం పై పలువురి అధికారులకు . సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడమైనది. హాస్టల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్స్ బాక్స్ పరిశీలించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడమైనది. అనంతరం పోస్ట్ మెట్రిక్ ఎస్సి బాలుర వసతిగృహంలో విద్యార్థులతో కలిసి భోజనం చేయడమైనది @TelanganaCMO @TelanganaCS @TeamKonda @mpponguleti