సంపన్నులకు దొచిపెట్టేవిదంగా బడ్జెట్: సిపిఎం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకించాలి: వై. యాకయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి.

బిబిఎంఏ న్యూస్  / గోదావరిఖని: ఫిబ్రవరి 03

కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ సోమవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని శ్రామిక భవన్ నుండి మెయిన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై.యాకయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకంగా ఉన్నదని అన్నారు. విద్య, వైద్యం, రైతు, సంక్షేమం తదితర రంగాలను ఈ బడ్జెట్ విస్మరించిందని అన్నారు. ఈ బడ్జెట్ సామాన్యులను దోచి, సంపన్నులకు పెట్టినట్లు ఉందని అన్నారు. బడ్జెట్ ను సవరించాలని, ప్రాధాన్యత రంగాలకు అధిక కేటాయింపులు జరిగేలా చూడాలని లేని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు చేపడ్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి,

గోదావరిఖని పట్టణ కార్యదర్శి ఎ.మహేశ్వరి, కమిటీ సభ్యులు వి.నాగమణి లతోపటు నవీన్, భాస్కర్, అనూష,

రజిత, మనెమ్మ, అరుణ జ్యోతి, సరిత, లక్ష్మీ, లావణ్య, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here