రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఛాంపియన్ షిప్ లో మూడో స్థానంలో రామగుండం పోలీస్ కమిషనరేట్,

పథకాలు సాధించిన కాలేశ్వరం కాలేశ్వరం జోన్ సిబ్బందిని అభినందించిన సిపి.. ఎం శ్రీనివాస్ ఐపిఎస్,

బిబిఎంఎం న్యూస్ // రామగుండం కమిషనరేట్,

పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి సీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ సందర్భంగా సీపీ కాళేశ్వరం జోన్ తరపున ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర స్థాయిలో ఉత్తిమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించినందుకు ముందుగా క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్పూర్తిని కనబరుస్తూ రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో రాణించి కాళేశ్వరం జోన్ మరియు రామగుండం పోలీస్ కమీషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను అభినందనలు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఇన్స్పెక్టర్ లు అజయ్ బాబు, కృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, మల్లేశం , సంపత్, సీసీ హరీష్, పతకాలు సాధించిన క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here