ఖని లో దూర విద్యను దూరం చేయద్దు..!

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్డిఎల్సిఈ దూర విద్యా ఆధ్యయన కేంద్రం యాధావిధిగా కొనసాగించాలి

బిబి ఎంఎ న్యూస్ఎ స్ /గోదావరిఖని ప్రతినిధి,

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఎస్డిఎల్సీఈ దూర విద్యా అధ్యయన కేంద్రాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ కాకతీయ యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్ట్రార్ లను కోరడం జరిగిందని ఒక ప్రకటన లో తెలిపారు.అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్డిఎల్సిఈ అధ్యయన కేంద్రం గత 26 సంవత్సరాల కు పైగా విజయవంతంగా కొనసాగుతున్నదని ఆయన అన్నారు. యూజీసీ నిర్ణయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 21 సెంటర్ల లో పని చేస్తున్న దాదాపు 50 మంది కౌన్సిలర్లు మరియు సిబ్బంది ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన నిబంధనలలో భాగంగా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలల్లో రెగ్యులర్ డిస్టెన్స్ కోర్సులు నిర్వహించాలని ఈ మధ్యకాలంలో ఒక జీఓ తీసుకువచ్చారని, ఈ జీఓతో ఉన్నత విద్య అభ్యసించాలనే కళ పేద విద్యార్థులకు అందని ద్రాక్షలాగ మారిందన్నారు.

గతంలో కాకతీయ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ పరిధిలో ఉండేవని, కరీంనగర్ జిల్లాకు శాతవాహన యూనివర్సిటీ వచ్చినప్పటికీ డిస్టెన్స్ కోర్సులు మాత్రం కేయూ పరిధిలోనివి నడుస్తున్నాయని,

శాతవాహన యూనివర్సిటీలో డిస్టెన్స్ కోర్సులు ఇంకా ప్రారంభం కాలేదని ఆయన పేర్కొన్నారు. యూజీసీ నిర్ణయంతో కరీంనగర్ జిల్లాలోని పలు అధ్యయన కేంద్రాలలో డిగ్రీ, పీజీ, కోర్సుల్లో ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు.మాంచెస్టర్ ఆఫ్ ఇండియా గా పేరుపొందిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు లక్షలకు పైగా జనాభా ఉందని, వివిధ కారణాలతో చదువు ఆపేసిన విద్యార్థులకు, నిరుద్యోగులకు, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కేయూ దూర విద్య అధ్యయన కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతున్నదని ఆయన అన్నారు.సుమారు గత ఇరవై ఆరు సంవత్సరాల కాలం నుండి గోదావరిఖని డిగ్రీ కళాశాలలో కేయూ దూర విద్యా అధ్యయన కేంద్రం నడుస్తున్నదని, ఎంతో మంది విద్యార్థులు ఈ అధ్యయన కేంద్రంలో డిగ్రీలు పూర్తి చేసి జీవితంలో ఉన్నత స్థాయిలో, ఒక ఉన్నత స్థితిలో స్థిరపడ్డారని ఆయన అన్నారు.ముఖ్యంగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం సింగరేణి బొగ్గు బావులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన అనేక మంది ఉద్యోగులు ఈ అధ్యయన కేంద్రంలోనే చదివి ప్రమోషన్లు పొందారని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం స్థానిక పాలకులు, ప్రజాప్రతినిధులు, మరియు మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడి స్టడీ సెంటర్లో విద్యనభ్యసించారని ఆయన అన్నారు.కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న స్టడీ సెంటర్ల లో విద్యను అభ్యసించాలంటే చాలా దూరం వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. దాదాపు 40 నుండి 70 కిలోమీటర్ల దూరంలో కేయూ పరిధిలో నడుస్తున్న మూడు జిల్లాల్లో దూరవిద్య అధ్యయన కేంద్రాలు ఉన్నాయని, విద్యార్థులను, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని గోదావరిఖని లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లోనే పాత పద్ధతి లాగా ఎస్డిఎల్సిఈ స్టడీ సెంటర్ ను యదావిధిగా కొనసాగించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ పక్షాన మరియు స్థానిక విద్యార్థుల, నిరుద్యోగుల ద్వార వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్ట్రార్ లను కోరడం జరిగిందని ఆయన ఒక ప్రకటన లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here