అక్రమ దందాలకు పాల్పడుతున్నా విలేకరులపై కేసు నమోదు..
బి బి ఎం ఏ న్యూస్ // రామగుండం కమిషనరేట్,
గోదావరిఖని, రాజన్నల కులానికి చెందిన మారుభేరస్తులు జక్కుల శ్రీధర్, మొగిలి అనిల్ లు 6ఎద్దులను సంపుఠం గ్రామంలో కొనుగోలు చేసుకుని ఒక మహేంద్ర వ్యాన్లో పెద్దపల్లి పశువుల సంత లో అమ్మెందుకు ఆదివారం తరలిస్తున్నారు. తెల్లవారు జామున సుమారు 3-20 ని”లకు ఎపి36 ఎం 1166 నంబరు గల కారులో చొప్పదండి జనార్ధన్, తుంగ రమేష్, మాసాని రమేష్, తోడేటి సంతోష్, జిల్లపల్లి పోచం, తగరం వెంకటేష్, దొబ్బల విష్ణు అను పశువుల వ్యాన్ ను అడ్డగించి తాము విలేకరులమని బెదిరింపులకు పాల్పడి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా వీరు బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు పేర్కొన్నారు. వీరి బెదిరింపులకు భయపడి ఫిర్యాది 25 వేల నగదు, మహేష్ తన ఫోన్ పే నెంబర్ 9177 322 625 నుండి అందులోనే ఉన్న తోడేటి సంతోష్ అను వ్యక్తి ఫోన్ పే నెంబర్ 966 68643 కి బలవంతంగా ఫోన్ పే ద్వారా డబ్బు బదిలీ చేయించుకున్నారని అన్నారు. ఫిబ్రవరి3న పై వ్యక్తులు మాస్కులు ధరించి ఫిర్యాదు బావమరిది ఆవులు ఐలయ్య దున్నపోతులు కల్లంపల్లిలో కొనుక్కొని వ్యానులో గోదావరిఖని తీసుక వెళ్ళచుండగా దస్నాపూర్ ఆశ్రమ పాఠశాల మూలమలుపు వద్ద ఆపి లక్ష రూపాయలు డిమాండ్ చేసి 15000 నగదు తీసుకోవడం జరిగిందని, రాజన్నల కులానికి చెందిన వారిని విలేకరుల ముసుగులో భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు కా చేసినారని వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఫిర్యాది కోరగా పై వారందరిపై కేసు నమోదు చేశామని నీళ్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శ్యామ్ పటేల్ తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా నీల్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఎస్ఐ కోరారు.