శ్రీకాకుళం జిల్లా పోలీసు.
పట్టణ పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేస్తున్న జిల్లా పోలీసులు.
నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా పెట్టి,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేస్తున్న జిల్లా పోలీసులు. ఆదివారం శ్రీకాకుళం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల దండివిధి,మేరకు డచ్ బంగ్లా, కంపోస్టు కోలని, దమ్మవిది, వాంబే కోలని తదితర పట్టణ చివర ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించడం ,గంజాయి సేవించడం,పేకాట, ఈవిటిజింగ్, చైన్ స్నాచింగ్, పేకాట , జూదం తడితర నేరాలు పై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. పాడుపడిపోయిన బంగ్లాలు,నివాస గృహాలు పై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం జరిగింది. బహిరంగంగా మద్యం సేవించడం గంజాయి సేవించడం వంటి వారు పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం,గంజాయి వినియోగం,పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణ,ఈవ్ టీజింగ్, ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. బహిరంగంగా మద్యం సేవించడం గంజాయి వినియోగించిన పేకాట ఈవ్ టీజింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కు పాల్పడినవారు పట్టుబడినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటన్నామని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి తెలిపారు.
@APPOLICE100